రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగమైన మహాలక్ష్మి పథకం ( 2500) తో పాటు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ లాంటి ప్రభుత్వ పథకాల కోసం, ప్రతి గ్రామంలో వారం రోజులు పాటు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు .ఆ సమయంలో హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్న వారి పరిస్థితి ఏమిటి? ప్రతి నాలుగు నెలలకు దరఖాస్తు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కానీ దరఖాస్తులు స్వీకరించడం లేదు?ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే దరఖాస్తులు స్వీకరించే వారం రోజుల గడువు సమయంలో తీవ్ర అనారోగ్యం కారణంగా ఒక మేజర్ ఆపరేషన్ కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో 40 రోజులు చికిత్స తీసుకోవలసి వచ్చింది. మేము వచ్చిన తర్వాత మా దరఖాస్తు తీసుకోవడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వం అందించే ఏ ఒక్క పథకం కూడా కులవృత్తిపై ఆధారపడి జీవించే నిరుపేదలమైన మాకు, కనీసం పక్కా ఇల్లు కూడా నాకు లేదు.ఈ పథకాలు అందడం లేదు, .కాబట్టి మా దరఖాస్తును వెంటనే స్వీకరించి ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలాచేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఇట్లు ఒక నిరుపేద కుటుంబం.
అరసవల్లి.ధనలక్ష్మి
W/o.వెంకటేశ్వరరావు
R/o చవటి గూడెం
అశ్వపురం గ్రామం,మండలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సెల్:9490834001..