పాస్‌వర్డ్‌లు ఎంత సంక్లిష్టంగా పెట్టుకున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు వాటిని బ్రేక్ చేస్తున్నారు.తాజాగా 1000 కోట్ల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు లీక్ చేశారని, దానికి సంబంధించిన భారీ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పెట్టారని సెమాఫోర్ నివేదిక తెలిపింది. ఈ వ్యవహారాన్ని అతిపెద్ద లీక్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.ఈ భారీ లీకేజీ వల్ల క్రెడెన్షియల్ స్టఫింగ్ దాడులు జరిగే ప్రమాదం ఉందని సెమాఫోర్ నివేదిక పేర్కొంది.