చదలవాడ నాగరాణి భర్త చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఆఫీసర్.హైదారాబాద్ ఎస్.ఆర్ నగర్ సెంటర్ లో పట్టపగలు డ్యూటీ నిమిత్తం వెళ్తుంటే నక్సలైట్లు కాల్చి చంపారు.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమేష్ చంద్ర భార్య అయిన నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం భాద్యతలు ఇచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించారు.నాగరాణి ఉద్యోగ బాధ్యతలు హుందాగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా వచ్చారు.
ఆమె బీబీమ్ చదివారు.ఒక కుమారుడు ఉన్నాడు.
నాగరాణి పుట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లా.