బొల్లారం పారిశ్రామికవాడలోని స్నేహా లిఫ్టు పరిశ్రమలో కార్మికుడుగా పని చేస్తున్న తేజేశ్వరరావు ప్రమాదవశాత్తు మృతి చెందారు. పరిశ్రమ యాజమాన్యం బాధితులకు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తానని చెప్పడంతో బాధితులు ఆనంద కృష్ణారెడ్డికి తెలపడంతో ఆయన పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపి 21 లక్ష రూపాయలను నష్టపరిహారం ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది.ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ బతుకు తెరువు కోసం పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు తాను ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నామని తెలిపారు.