Type Here to Get Search Results !

పారిశుద్ధ్య, భద్రత పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు ఏడు నెలలుగా జీతాలు లేక అవస్థలు

ఏడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి.పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి.
జీతాలు లేక అవస్థలో ఆసుపత్రి కార్మికులు,జాడ లేని ఏజెన్సీ కాంట్రాక్టర్.
ఆత్మకూరు సి హెచ్ సి ఎదుట ఆసుపత్రి కార్మికుల నిరసన, వైద్య అధికారి డాక్టర్ వంశీ కి వినతి.
ఆత్మకూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని పారిశుద్ధ్య, భద్రత పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు ఏడు నెలలుగా జీతాలు లేక అవస్థలో ఉంటే ఏజెన్సీ కాంట్రాక్టర్ మాత్రం జాడా లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు ఏడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆద్వర్యంలో ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టి ఆస్పత్రి వైద్యాధికారి డాక్టరు వంశీ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులుసత్తార్,బాలరాజ్,మోహినిద్దీన్,పార్వతమ్మ,చెన్నమ్మ, నాగమ్మ,బాలకిష్టమ్మ, శైలజా, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.