Type Here to Get Search Results !

జ్వాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామంలో జ్వాలా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి తాడ్వాయి మండలంలోని బిరేల్లి గ్రామం నుండి 10 మంది యూత్ దామెరవాయి నుండి 20 మంది పెద్దలు&యూత్ తాడ్వాయి నుండి 2 మొత్తం 32 మంది పాల్గొన్నారు.ఇంత మంచి కార్యక్రమానికి హాజరు అయినందుకు దామెరవాయి బీరెల్లి తాడ్వాయి నుండి పాల్గొన్న వారందరికీ , ఇంత మంచి ప్రోగ్రాం చేసిన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ బృందం చైర్మన్ కోడెల నరేష్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ గ్రామ యువకుడు కార్తీక్ కు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు , జ్వాలా ట్రస్ట్ బృందం పాల్గొన్నారు