కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది ఇంటర్ పాసైన విద్యార్థులు అక్టోబర్ 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చంది. గతంలో అప్లె చేసిన వారు 2024-25 విద్యా సంవత్సరం కోసం మరోసారి రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. నవంబర్ 15లోగా నోడల్ అధికారి వెరిఫికేషన్ చేస్తారని తెలిపింది.