Type Here to Get Search Results !

మత మార్పిడి పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మతమార్పిడిపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట విరుద్ధమైన మత మార్పిడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావు నాయక్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. పౌరులకు రాజ్యాంగం తమ మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి హక్కును కల్పించిందని కోర్టు తెలిపింది. కానీ మతమార్పిడి చేయడానికి లేదా ఇతరులను మతం మార్చడానికి సామూహిక హక్కుగా దీనిని విస్తరించ లేమని పేర్కొంది.