ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో అసంపూర్తిగా బ్రిడ్జిని నిర్మించడం జరిగిందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఈ విషయంపై స్పందిస్తూ రానున్నది వర్షాకాలం కావున కమలాపురంలో మూడు బ్రిడ్జిలు గత ప్రభుత్వంలో శాంక్షన్ అవ్వగా వాటిలో రెండు బ్రిడ్జీలను అర కోరగా నిర్మించడం జరిగింది .పెద్దయ్య చెరువు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని అసంపూర్తిగా నిర్మించారు కావున పెద్దయ్య చెరువు అలుగు పడినచో నిరంతరం వరద వస్తుంది దాని వలన కమలాపురం గ్రామ ప్రజలు వాహన దారులు రైతులు లకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా భావించవలసి వస్తుంది కావున స్థానిక MLA , రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై దృష్టి సారించి త్వరగా బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలి అని ములకలపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు గరికె రాంబాబు, మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం, కార్యకర్తలు సున్నం నాగబాబు, చెన్నారావు ఇతరులు పాల్గొన్నారు