Type Here to Get Search Results !

ఫుల్ వీల్స్ తో రోడ్డెక్కితే ట్రాక్టర్ సీజ్; ఏస్ఐ ఎస్ కే షాకీర్

కల్లూరు మండలంలో ట్రాక్టర్ యజమానులు ఎవరైనా ఫుల్ వీల్సులతో తారు రోడ్డు ఎక్కి వాహనాలు నడిపినట్లయితే అట్టి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సై ఎస్కే షాకీర్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్న తరుణం నందు దమ్ములు చేయడానికి ఉపయోగించే ట్రాక్టర్ దమ్ము చక్రాలతో పనిచేస్తుంటారు. ఎవరైతే దమ్ములు చేస్తున్నారో పుల్ వీల్స్ తీసుకు వెళ్లేటప్పుడు ఇంటిదగ్గర ట్రాక్టర్ల మీద తీసుకొని వెళ్లి పని ప్రదేశంలో దించుకోవాలని ఆయన తెలియజేసినారు. ఫుల్ వీల్స్ చక్రాలను తారు రోడ్లపై నడపవద్దని ఆయన అన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో తారు రోడ్లను ఏర్పాటు చేశారు అని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందిని అన్నారు. ఫుల్ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లను పాడు చేయటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఫుల్ వీల్స్ ట్రాక్టర్ల ద్వారా రోడ్లను పాడు చేస్తారో అట్టి నేరం వారి మీద కూడా వర్తిస్తుందని అన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ ఉండాలని, ట్రాక్టర్ నడిపేటప్పుడు ఎటువంటి సౌండ్ బాక్సులు ఉపయోగించకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఇట్టి నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రోడ్లను పాడు చేస్తే ఆర్ అండ్ బి యాక్ట్ ప్రకారం సీజ్ చేయటం, రెండు రెట్లు జరిమానాలు విధించడం, పోలీసు వారి చట్టపరమైన చర్యలు ఉంటాయని అని అన్నారు. ఈ వర్షాకాలం సీజన్ అయిపోయే వరకు ఎవరు రోడ్లను పాడు చేయకుండా దమ్ము చక్రాలు లను రోడ్లపై తీసుకురాకుండా జాగ్రత్త వహించాలి అన్నారు. మా ఆదేశాలు నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా ఉన్నట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకొని ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు సహకరించాలని ఆయన కోరినారు.