మణుగూరు మండలం లోని కూనవరం రైల్వే గేటు దగ్గర ఉన్న కోడి పుంజుల వాగు బ్రిడ్జ్ వరదలు వలన కృంగిన విషయం తెలుసుకొని హుటా హుటున వెళ్లి పర్శిలించిన ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు.ఈ సందర్బంగా గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం నిర్మాణం చేసిన బ్రిడ్జ్ గత సంవత్సరమే వచ్చిన వరదలకు పైన ఉన్న సైడు వాల్, దిమ్మలు కొట్టుకొని పోయాయి అని, మరలా ఈ సంవత్సరం నాలుగైదు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు అడుగు భాగం లో ఇసుక కొట్టుకుపోవడం వలన క్రింద భాగం కృంగినదని, దీనికి కారణం కాంట్రాక్టర్, అధికారులుకు ముందస్తు ఆలోచన లేకపోవడమేనని,పనులు జరిగే సమయం లో నిర్లక్ష్యంగా వ్యవ రించ్చారని ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు ఆరోపించారు.
కృంగిన కోడి పుంజుల వాగు బ్రిడ్జ్ ను పర్శిలించిన ఎం పి టి సి గుడిపూడి
July 24, 2024
Tags