Type Here to Get Search Results !

ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులోవిచారణ

హైదరాబాద్; 
జులై 10,2024; Y7News Telugu 
ఫోన్ ట్యాపింగ్పై ఇవాళ హైకోర్టులో
విచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు,
రాజకీయనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణ
పోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతో
కౌంటర్ దాఖలు చేశారు. దీంతోపాటు తెలంగాణలో
పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు
సైతం ట్యాపింగ్ చేసినట్లు మీడియాలో కథనాలు
వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
ఇవాళ మధ్యాహ్నం 2:30గంటలకు విచారణ
చేపట్టనుంది.