జులై10,2024; Y7News Telugu
నటుడు సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనంబు హోటల్ పై ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేశారు. 2022 నాటికే గడువు ముగిసిన బియ్యం బస్తాలు, 500 గ్రాముల సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరి తురుము, వండిన ఆహారాన్ని ఎలాంటి లేబుల్ లేకుండా ఫ్రిడ్జ్ లో భద్రపరిచారని అధికారులు వివరించారు. అంతే కాకుండా కిచెన్ లో డ్రైన్ నీరు నిల్వ ఉందని అన్నారు. హోటల్ పై కేసు నమోదు చేశామని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.