జులై11,2024; y7News Telugu;
ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభావం తగ్గడంతో కాంగ్రెస్ పట్టు పెంచుకునే వ్యూహాలకు పదును పెట్టింది. వైఎస్ఆర్ జయంతి గ్రాండ్‌గా నిర్వహించి కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. మరోవైపు అప్పట్లో YSRకు సన్నిహితంగా ఉన్న వారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్, రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేతల టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.