పినపాక: y7news Telugu
రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం అన్నారు. పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మీ ఆరున రాహుల్ గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రకారం రైతు రుణమాఫీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. 21.06.24 శుక్రవారం తెలంగాణలను రైతులందరికీ ఒకే దఫా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 400 కే గ్యాస్, రైతు రుణమాఫీ, 200 యూనిట్లు వచ్చిన కరెంటు వంటి ప్రజాకర్షగా పథకాలతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశ దృష్టిని ఆకర్షించింది అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ భవిష్యత్తును బంగారమయం చేసేందుకు, రేవంత్ సర్కార్ సుదీర్ఘ ప్రణాళికలు రచిస్తుందన్నారు.. కార్యక్రమంలో పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాస్ రావ్, మైనారిటీ సెల్ పినపాక నియోజకవర్గం అధ్యక్షులు బషీరుద్దీన్, సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మిరెడ్డి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, జాడి రాంబాబు, స్వతంత్ర రెడ్డి, గట్ల శ్రీనివాస్ రెడ్డి, పొనగంటి మల్లయ్య, ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి, కూనరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.