తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో తనిఖీల్లో భాగంగా గోల్డెన్ హోటల్ నూ సందర్శించిన ఫుడ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ తౌర్య నాయక్, మున్సిపల్ కమిషనర్ ఖాజామోయినుద్దీన్, గోల్డెన్ హోటల్లో ఉన్న వంట రూమును సందర్శించి వంటకాల పాత్రలను వంటకాల సామాగ్రిని వండిన వంటకాలను పరిశీలించి నాణ్యతతో వండిన వంటకాలను గమనించి చాలా బాగున్నాయన్నారు. ఇదే తరహాలో సూచి శుభ్రతతో హోటల్లను నడుపు కొవాలని గోల్డెన్ హోటల్ యజమానులకు కితాబిచ్చారు. ప్రతి బిర్యాని హోటల్లు ఇదేమాదిరిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.