
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో బిజెపి పార్టీ నాయకులు మంగళవారం మణుగూరు తహసిల్దార్ కు రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని, భూమి గల వ్యక్తులకి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉన్నం బిక్షపతి, లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.