Type Here to Get Search Results !

సార్..మీరు వెళ్లొద్దు...మీరే మాకు కావాలి..

ఉపాధ్యాయ బదిలీలలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల, సాదుల్లానగర్ ఉపాధ్యాయుడు M. లోకనాధం గారు బదిలీ కావడంతో *సార్ మీరు వెళ్లొద్దు, మీరే మాకు కావాలి అంటూ విద్యార్థులు బోరున ఏడ్చారు.ఈ పాఠశాలలో 11సం.6నెలలు పనిచేసి, పాఠశాల అభివృద్ధి కొరకు పాటుపడుతూ, విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, పాఠశాల కొరకు నిరంతరం శ్రమిస్తున్న తమ ఉపాధ్యాయులు బదిలీ అవ్వడం తమకు చాలా బాధాకరం అని విద్యార్థులు ,గ్రామస్థులు బాధను వ్యక్తం చేశారు..