బెల్లంపల్లిలో మండలంలోని ఆకెనపల్లి గ్రామం లో సోమవారం దేవ వినోదం (25) ను తండ్రి దేవ మారాలు గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వినోద్ ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే వినోద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దేవ వినోద్ మృతికి కుటుంబ కలహాలే కారణమని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జల్ది, తాళ్ల గురజాల ఎస్సై నరేష్ తెలిపారు.